నర్సింహులపేట, ఆంధ్రప్రభ : ప్రజల రక్షణ కోసమే కాదు దేశా(The country)నికి అన్నం పెట్టే అన్నదాతకు సహాయపడడంలో ముందుంటామని నిరూపించాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పోలీస్(Police) కానిస్టేబుల్ రమేష్ ఈ రోజు స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(Society) వద్ద యూరియా బస్తాలను తీసుకెళ్లేందుకు ఓ రైతు బైక్ మీద ఒక్కడే వచ్చాడు.
నువ్వు బండి మీదనే ఉండు రైతన్నాఅని ఓ అన్నదాత సహకారంతో కానిస్టేబుల్ రమేష్‌కు సహాయపడుతూ యూరియా(Urea) బస్తాను బండి మీద వేసి పంపించాడు. అక్కడ ఉన్న అన్నదాత(Annadata)లు చూసి రమేష్‌ను అభినందించారు.
ఈ సందర్భంగా కానిస్టేబుల్ రమేష్‌ను ఆంధ్రప్రభ పలకరించగా.. తాను రైతు కుటుంబం నుంచే వచ్చానని తమ తల్లిదండ్రులు కూడా వ్యవసాయం(Agriculture) చేస్తారని రైతు కష్టం తనకు తెలుసునని ఆయన చెప్పుకొచ్చాడు.

