ఉత్స‌వాల‌కు ముగింపు..

జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా(Asifabad District)లోని ఏజెన్సీ ఆదివాసి గూడలలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని గత పక్షం రోజులుగా ఆదివాసీ గుడ‌ల్లో వైబోవపేతంగా కొనసాగిన గుస్సాడి దండారి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఊరూరా కొలబొడి ఉత్సవాలతో గుస్సాడి వేషధారణలు, చాచోయి కోలాటం.. రేలా రేలా నృత్యాలకు ముగింపు పలుకుతు న్నారు. ఈ రోజు మండలంలోని లెండిజాల, మణిగూడ, గూడ మామడ, కరణంగూడ, గౌరీ, కాశీపటేల్ గూడ, రాసిమెట్ట, ఆశపల్లి తదితర గ్రామాల్లో కొలబొడి ఉత్సవాలు నిర్వహించారు.

ఆయా గ్రామాల్లో గ్రామ దేవతల వద్ద సంప్రదాయ బద్ద పూజలు చేసి గుస్సాడీ వేషధారణ(Gussadi Disguise) విరమణ చేశారు. అంతకు ముందు ఇంటిటికీ ఎత్మ సార్ దేవతల(Etma Sar gods)కు మంగళ హారతులతో పూజలు చేసి మొక్కుకున్నారు. కొత్త పిండి వంటకాలు, సగ్గు బియ్యం సేకరించి గ్రామ దేవత వద్ద నైవేద్యం సమర్పించారు.

మహిళలు, పురుషులు వయోభేదం లేకుండా గ్రామాల్లో సహా పంక్తి భోజనాలు చేసి అర్దరాత్రి వరకు సామూహికంగా కలసి ఆడిపాడరు. ప్రతి ఆదివాసి గ్రామంలో కొలబడి పూజలు చేసి దండారి సంబరాలకు ముగింపు పలుకుతున్నారు. రోజుల బడి దండారి గుస్సాడీ సంబరాలు కాళ్ల గజ్జల సవ్వల చప్పట్లు, డప్పుల మోతల(drums, etc.)తో మారు మోగిన ఆదివాసిగూడలో దండారి గుస్సాడీ ఉత్సవాలు ముగింపుతో నిశ్శబ్ద గూడలుగా మారాయి.

Leave a Reply