- తెల్ల గరుగు గుట్ట గుట్టు రట్టు
- దండుపాళెం గ్యాంగ్ పట్టివేత
- ఇందులో ఏడుగురు నొటోరియస్
- డెకాయిట్లు.. రేపిస్టులు.. మర్డరిస్టులు
- మరిన్ని వివరాలు త్వరలో..
(ఆంధ్రప్రభ, శ్రీసత్యసాయి జిల్లా) : అదొక దొంగల ముఠా. ఒకరకంగా.. దండుపాళెం గ్యాంగే (Dandupalem Gang). దారి దోపిడీలు వీరికి చాలా ఈజీ. లేడీ కనిపిస్తే రేప్ ఖాయం. ఇక చంపుడు, దోచుడే వీరి టార్గెట్…. వీళ్లల్లో ఇప్పటికి ఇద్దరు జీవిత ఖైదీలు. ఇది సరే, మరొకడు ఇటీవలే గుంటూరు జైలు గోడ దూకేశాడు. ఎట్టకేలకు ఈ ముఠాను నంద్యాల జిల్లా పోలీసులు పట్టేశారు. ఈ ఏడుగురు కరుడుగట్టిన నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం వీరందరూ పోలీసుల విచారణ (Police investigation) లో ఉన్నారు. మరికొన్ని తాజా హత్యలు, నేరాలు గుట్టు విప్పుతున్నారు. కొండల్లో గుట్టల్లో మకాం వేసిన ఈ దండుపాళెం ముఠాను సినీ ఫక్కీలో చుట్టుమట్టి.. వల పన్ని పోలీసులు పట్టుకున్న తీరు థ్రిల్లర్ మూవీ సీన్ తలపించింది.
చెంచుగాడి లీకేజీ ఇది..
నంద్యాల జిల్లా (Nandyal District) పాణ్యంలోని చెంచు కాలనీ మరో పేరు ఇందిరమ్మ కాలనీ. దాదాపు 150 చెంచు కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ కాలనీ నేర చరిత్రను పరిశీలిస్తే.. ఒకప్పటి స్టువర్టుపురం దొంగల కథ (Stuartpuram thieves story) గుర్తుకు వస్తుంది.
కాలంతో పాటు చెంచుకాలనీలో జనజీవన తీరు మారింది. దొంగతనాలు, దోపిడీలకు జనం దూరమయ్యారు. కానీ ఇంకా కొందరు కరుడు గట్టిన నేరగాళ్లల్లో మార్పు రాలేదు. వీరిలో ఏడుగురు ఇంకా సంచార దోపిడీ దొంగలు (Robbers) గా జీవితం సాగిస్తున్నారు. ఈ స్థితిలో ఈ నేరస్థులను పట్టుకునేందుకు తాజాగా పోలీసుల వేటలో దూకుడు పెరిగింది.
ఇటీవలే ఓ చెంచుగాడు.. అనే యువ దొంగ పోలీసులకు (police) చిక్కాడు. ఏడుగురు బందిపోట్ల సమచారం అందించాడు. అదేంటంటే.. తనకల్లు మండలం చెక్కవారి పల్లి సమీపంలోని తెల్ల గరుగు గుట్టపై ఏడు కుటుంబాలు ఆరునెలలుగా ఉంటున్నాయి. ఈ ముఠా కుటుంబాల్లో పలువురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. బొగ్గులు కాల్చుకుంటూ ఉపాధి పొందుతున్నారని స్థానికులు భావించారు. ఇటీవల చెంచు గాడు అనే ఈ ముఠా సభ్యుడు ఇటీవల పాణ్యం పోలీసులకు చిక్కాడు.
అతడిచ్చిన సమాచారంతో ఈ ముఠా గుట్టు బయట పడింది, చెంచుగాడిని వెంటబెట్టుకుని నాలుగు రోజుల కిందట పాణ్యం పోలీసులు కదిరికి వచ్చారు. దొంగల స్థావరాన్ని కనిపెట్టేందుకు డ్రోన్ల సాయం తీసుకున్నారు. కదిరి రూరల్ సీఐ (Kadiri Rural CI) నాగేంద్ర ఆధ్వర్యంలో ముగ్గురు ఎస్ఐలు, 70 మంది పోలీసులు, 50 మంది స్థానిక యువకులు వలలు తీసుకుని అటవీ ప్రాంతానికి వెళ్లారు. పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి.. ఏడుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. మారణాయుధాలు, నగదు, కొంత బంగారం స్వాధీనం చేసుకున్నారు.
గతమంతా నేరాలు ఘోరాలే …
ఈ ఏడుగురు నిందితులు పల్నాడు, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో కూడా పలు నేరాలకు పాల్పడ్డారు. అంతర్రాష్ట్ర ముఠా (Interstate gang) గా పోలీసు రికార్డుల్లో చేరారు. దారి దోపిడీలు, దొంగతనాలు చేశారు, అత్యాచారాలు, హత్య లకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో రెండు జంటలను హత్య చేశారనే ఆరోప ణలున్నాయి.
ఒక్కొక్కరిపై 20 నుంచి 30 కేసులు నమోదైనట్లు సమా చారం. వీరిలో ఇద్దరు జీవిత ఖైదీలు ఉండగా, ఒకరు గుంటూరు జైలు (Guntur Jail) నుంచి పారిపోయినట్లు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో చెబుతామని పాణ్యం పోలీసులు చెబుతున్నారు.