కౌన్సిలర్లు అంటే లెక్క లేదా…?

కౌన్సిలర్లు అంటే లెక్క లేదా…?
వైరా మున్సిపాలిటీ కమిషనర్ తీరుపై మండిపడ్డ కౌన్సిలర్లు
వాడి వేడిగా సాగిన కౌన్సిల్ సమావేశం
వైరా,ఆంధ్రప్రభ : వైరా మున్సిపాలిటీ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం వాడి వేడిగా సాగింది…. కనీసం మున్సిపల్ కౌన్సిలర్ అంటే విలువ ఇవ్వకుండా… అగౌరవం కలిగించేలా… వైరా మున్సిపాలిటీ కమిషనర్ గురు లింగం వ్యవహరిస్తున్న తీరుపై పలువురు కౌన్సిలర్లు మండిపడ్డారు. కనీసం సమాచారం ఇవ్వకుండా… ఏకపక్ష నిర్ణయాలపై గజమెత్తారు… గత ఏడేళ్ల పాటు… అవినీతి మున్సిపాలిటీగా పేరుందిన.. వైరాను పాలక వర్గం మారినప్పటికీ.. అవినీతి మాత్రం అలానే రాజ్యమేలుతుందంటూ ధజమెత్తారు.
కార్మికుల కాకి వస్త్రాల కుట్టుకూలి వ్యవహారంపై కొంత సేపు చర్చ జరిగింది… ఆ నగదును అన్ని నెలల పాటు… కమిషనర్ వద్దనే ఉంచడంపై.. అసలు విషయం ఏంటంటూ ప్రశ్నించారు. అదేవిధంగా… కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి… సమాచారం విషయంపై 13వ వార్డు కౌన్సిలర్ ముల్లపాటి విజయలక్ష్మి ధ్వజమెత్తారు.. కౌన్సిలర్లు అంటే… చెప్పింది విని… ఏం చేసినా… ఎం చెప్పినా తల ఊపుతూ వెళ్లే వారిలా కనిపిస్తున్నామా అంటూ…. కో ఆప్షన్ విషయం వార్తల్లో రాయగానే హుటాహుటిన రాత్రి వేళలో సర్కులర్ ను జారీ చేయడంపై మండిపడ్డారు.
అదేవిధంగా…. మున్సిపాలిటీ కమిషనర్ స్థాయిలో అధికారి 20 వార్డుల్లో 99 రోజుల్లో జరిగే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పనులు పర్యవేక్షణ విషయంలో కనీసం వార్డుల్లోకి రాకపోవటం… పనుల పరిశీలన…. లేకపోవడంపై ప్రశ్నించారు… అదేవిధంగా… వార్డుకు కమిషనర్ వస్తున్నారని తెలియగానే తాము.. పనులన్నీ పక్కనపెట్టి అధికారి కోసం ఎదురు చూశానని… అయినప్పటికీ రాకపోవటంపై… అసంతృప్తి వ్యక్తం చేశారు… ఇదిలా ఉండగా… కమిషనర్ గురు లింగం మూడో వార్డులో… 99 రోజుల పనుల్లో పాల్గొనటం పై… కౌన్సిలర్ల పై పక్షపాత ధోరణి వ్యవహరించటం సరైనది కాదని… ఆవేదన వ్యక్తం చేశారు … అంతేకాకుండా తొలత ఎనిమిదో వార్డు కౌన్సిలర్ చిలక చిన్న కోటయ్య మాట్లాడుతూ.. 99 రోజుల పనుల్లో.. కొన్ని వార్డులకే కమిషనర్ తో పాటు అధికారులు ప్రాధాన్యతనిస్తూన్నరన్నారు… పా రిశుద్య పనుల్లో డ్రైన్ లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని, రోడ్డు పక్కన కుప్పలుగా వేశామని… పలుమార్లు అధికారులకు వాటిని తొలగించాలని విన్నవించినా కూడా.. రోజుల తరబడి అక్కడే ఉంచడంతో చేసిన పనికి అర్థం లేకుండా పోయిందని ప్రజల నుండి విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
తమ వార్డులో . జెసిబి డోజర్అవసరాన్ని పలుమార్లు.. అధికారులకు తెలిపిన కూడా… అవి కూడా కొన్ని వార్డులకే పరిమితం అయ్యాయి అన్నారు… దీంతో వైరా మున్సిపల్ చైర్ పర్సన్ కాపా చంద్రకళ స్పందించి.. కౌన్సిలర్ అందరూ సమానమేనని… ఒకరోజు ముందుగానే.. వార్డు కౌన్సిలర్ కు ఆ పనులకు సంబంధించి సమాచారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.. అదేవిధంగా ఏడవ వార్డు కౌన్సిలర్ పనితీ సైదులు కౌన్సిల్లో తీవ్రంగా ధ్వజమెత్తారు… చెడిపోయిన చేతి పంపు బోరు మరమ్మత్తు కోసం కావలసిన వెయ్యి రూపాయల ఖర్చు అయ్యే సామాన్ల కోసం 28 రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
వెయ్యి రూపాయల సామాగ్రికే అన్ని రోజులు ఎదురు చూసామని.. వెయ్యి రూపాయలు అభివృద్ధికి కేటాయించలేని వైరా మున్సిపాలిటీ అధికారులు లక్షల అవినీతి విషయంపై తీవ్రంగా మండిపడ్డారు… కార్మికుల కుట్టుకూలీ నెలల తరబడి ఉంచడంపై ప్రశ్నించారు… అయితే తొలుత సమావేశం ప్రారంభంలోనే మున్సిపల్ కమిషనర్ గొర్లింగం ఇది కేవలం బడ్జెట్ కు సంబంధించిన కౌన్సిల్ సమావేశం అని ఇతర విషయాలు ప్రస్తావించొద్దని హుకుం జారీ చేశారు… అయినప్పటికీ కౌన్సిలర్లు… తాము ఎదుర్కొంటున్న,వైరా మున్సిపాలిటీ కమిషనర్ తీరుపై అనివార్యంగానే ధ్వజమెత్తారు… ఒకానొక దశలో ఉద్యోగులు తరుపున ఇటుకల మురళితోపాటు కమిషనర్ తమపై అవినీతి వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆయా వార్డులోని కౌన్సిలర్లు ఖండించకపోవడం విచారమని పేర్కొనటం కొసమెరుపు…
