మొక్కజొన్న విత్తనం గుట్టు

భారీ డంపు మర్మమేమిటో?


(అర్ధవీడు, ఆంధ్రప్రభ) : ప్రకాశం జిల్లా (Prakasam district) అర్థవీడు మండలంలో విత్తన కంపెనీల మాయ అంతు చిక్కడంలేదు. ఒక వైపు ధర పడిపోయింది అని ఎజెంట్లు అంటున్నారు. విత్తనం అందుబాటులో లేదనీ డంకా భజాయిస్తున్నారు. రైతుల్లో అభద్రతను సృష్టిస్తున్నారు. రైతులే తమను బతిమాలుకునేలా వ్యవహారిస్తున్నారు. మరో వైపు డంపులకు డంపులు విత్తనం దించుతున్నారు. ఓ కంపెనీ వ్యవహారం అయితే అంతు చిక్కడం లేదు. దాని పరపతి రైతుల్లో దిగజారి పోతోంది. ఆ కంపెనీ విత్తనం నాటిన రైతులు ఏటా నష్ట పోతూనే వున్నారు. పరిహారం కోసం తగువు పడుతూనే వున్నారు. యథామామూలుగానే అది పంగనామాలు పెడుతూనే వుంది. గత సీజన్లో అయితే పాపినేనిపల్లి, చీమలేటి పల్లి, దొనకొండ గ్రామాల్లో ఆ కంపెనీ రైతులు భారీ నష్టం చవి చూశారు.

కనీసం తినడం కోసం వెదికినా ఆకర్షణీయమైన ఒక్క మొక్క జొన్న పొత్తు లభించినంతగా పంట దిగుబడి దిగజారింది. ఈ దృష్ట్యా ఆ కంపెనీ తన ఇద్దరు ఏజెంట్లను ఈ ఏడాది వెనక్కు తీసుకుంది. ఒక్క కందుకూరు (Kandukuru) గ్రామంలో మాత్రమే ఆ కంపెనీ విత్తనం కాస్త మెరుగైన దిగుబడులు సాధించింది. కొంత కాలంగా ఈ ఒరవడిని పట్టుకొస్తుంది. ఇలాంటి తీవ్ర ప్రతికూల పరిస్థితిలో ఆ కంపెనీ భారీ విత్తన డంపును మండలంలో దించింది. అత్యంత విశ్వసణీయ సమాచారం మేరకు వివిధ ప్రమాణాల్లో వున్న 420 బస్తాల విత్తనాన్ని ఇటీవలే డంపు చేసింది. సగటున 25,200ల కేజిల విత్తనం ఉంటుందని అంచనా. అంటే అది 2520 ఎకరాలకు సరిపడ విత్తనం అన్నమాట. ఇది ఆ కంపెనీ సామర్ధ్య తాహతుకు మించింది.ఈ విషయమే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పలు అనుమానాలకు తావిస్తోంది. ఒక అంచనా ప్రకారం ఆ కంపెనీ పరిధిలో విత్తన సాగు మండలంలో 400 నుంచి -500 ఎకరాలు మాత్రమే.

పైగా ప్రస్తుతం తన ఎజెంట్లల్లో ఇద్దరినీ వెన్నక్కి తీసుకుంది. అంటే ఇంకా తన సాగు పరిధి తగ్గిపోతుంది. అలాంటప్పుడు సరిపడ విత్తనానికి బదులు 5-6 రెట్లు అధికంగా ఎందుకు దించింది? అనేది తొలుస్తున్న కీలక ప్రశ్న. వ్యవసాయ శాఖ (Agriculture Department) అధికారిక లెక్క ప్రకారం గత సీజన్ లో సాగైన మొక్కజొన్న విత్తనోత్పత్తి విస్తీర్ణం 2135 ఎకరాలు మాత్రమే. ఇందులో ఏడు కంపెనిలకు భాగస్వామ్యం వుందని అధికారిక రిపోర్ట్. (వాస్తవంలో కంపెనీల సంఖ్య, విస్తీర్ణం ఇంకా ఎక్కువే) అలాంటిది దిన దినం దిగజారుతున్న ఆ కంపెనీ ఒక్కటే మండల సాధారణ సాగుకు మించి విత్తనం డంపు చేయడంలో మర్మమేమిటి? తనకు ప్రతికూలత వున్నపుడు భారీ డంపు ధించి ఏ విపత్తును సృష్టించబోతోంది. ఇంతకీ అవి అసలీవేనా? లేక నకిలీవా? తెల్చేదెవరు? విత్తిన రైతు సంగతేంటి? బతికి బట్ట కడతాడా? అప్పుల ఊభిలో కూరుకు పోవాలా? ఇంతకీ విత్తన రైతు బతుక్కి భద్రత ఉంటుందా? అదృష్ట రేఖలకు వదిలేయాల? లేక చట్టం రాతలు రక్ష రేఖలుగా నిలుస్తాయా? భరోసా భవిష్యత్తే చెప్పాలి.

Leave a Reply