ఉట్నూరుకు చేరుకున్న రథయాత్ర

ఉట్నూర్, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకాలు చేర్చాలని డిమాండ్ చేస్తూ జై భీమ్ మహాసేన, విశ్వ జన కళామండలి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తెలంగాణలో మార్చి 1న ప్రారంభమైన రథయాత్ర శనివారం అదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఎక్స్ రోడ్డుకు చేరుకుంది. ఉట్నూర్ ఎక్స్ రోడ్ లో జరిగిన కార్యక్రమంలో జై భీమ్ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షులు రాజ్యాంగం అంజన్న, విశ్వజన కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు మాస్టర్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకాలు చేర్చాలని డిమాండ్ చేస్తూ 33 జిల్లాల్లో రథయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత రాజ్యాంగాన్ని అన్ని పాఠ్యపుస్తకాలు చేర్చేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అన్ని జిల్లాలు రథయాత్ర అనంతరం పాఠ్యపుస్తకాల్లో రాజ్యాంగాన్ని చేర్చాలని ఏప్రిల్ నెలలో రిలే దీక్షలు నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని ఏప్రిల్ 14న అమరణ నిరాహార దీక్ష చేపడతామని వారన్నారు అనంతరం నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
