గోవింద నామస్మరణలో కొడవటంచ

గోవింద నామస్మరణలో కొడవటంచ

  • భారీగా తరలి వచ్చిన భక్తజనం
  • నాగబలితో ముగిసిన బ్రహ్మోత్సవాలు

రేగొండ, ఆంధ్రప్రభ ; రేగొండ : గోవింద నామస్మరణతో కోటంచ మార్మోగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తజనం పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. కోరిన కోర్కెలు నెరవేరినందుకు స్వామి వారికి ఏనుగు వాహనాలు, మేకలు, గుర్రం బండ్లను ప్రత్యేకంగా తయారు చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. జాతరకు వరంగల్‌ ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల కోసం ఆర్టీసీ బస్సులు, తాగునీటి వసతి, స్నానఘట్టాలు, తదితరఏర్పాట్లుచేశారు.గురువారం స్వామివారిని నిజరూప దర్శనంలో భక్తులు దర్శించుకున్నారు.

అత్యంత వైబోవాపేతంగా నాగబాలి..

గురువారం వేద పండితుల మంత్రోత్సరాల నడుమ లక్ష్మీ నరసింహ స్వామి వారి నాగబలి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్యాలు పలువురు భక్తులను ఆకట్టుకున్నాయి.

ముగిసిన బ్రహ్మోత్సవాలు…

ఫిబ్రవరి 26 నుండి మొదలైన కోటంచ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగి నాగబల్లితో ముగిసాయి. వారం రోజులపాటు కొనసాగిన బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి అనేక మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని తమ తమ కోరికలు తీరాలని వేడుకున్నారు. ఈ సంవత్సరం ఆలయ అభివృద్ధి చెందడంతో ఆలయం చూసేందుకు భక్తులు లక్షల సంఖ్యలో హాజరయ్యారు ఈసారి విఐపి లతాకిడి ఎక్కువగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు.

బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసిన భక్తులకు ధన్యవాదాలు తెలిపిన ఆలయ కమిటీ వారం రోజులపాటు సాగిన బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసినందుకు ఆలయ చైర్మన్ సంపత్ రావు ఈవో మహేష్ ఆలయ కమిటీ సభ్యులు ఆయా శాఖ అధికారులకు పోలీస్ సిబ్బందికి ఆర్టీసీ సిబ్బందికి వైద్య సిబ్బందికి పంచాయతీ శాఖ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రస్తుత ఎమ్మెల్సీ శాసనసభ ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదన చారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, జిల్లా అధ్యక్షురాలు. గండ్ర జ్యోతి ఆలయ చైర్మన్‌ నాయినేని సంపత్ రావు,ఈవో. మహేష్,ఆలయ ధర్మకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply