శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంలో కారు దగ్ధం

శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంలో కారు దగ్ధం
శంషాబాద్, ఆంధ్రప్రభ : శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంలోని పెద్ద గోల్కొండ వద్ద ఓ కారుకి ఘోర ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే రన్నింగ్ లో ఉన్న ఓ కారులో మంటలు చెలరేగి, నిమిషాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైంది. మంటలను గమనించిన ప్రయాణికులు వెంటనే కిందకు దిగడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమా లేదా ఇంకేదైనా ఉందా అని ప్రాథమికంగా భావిస్తున్నారు.
