నూతన సిలబస్ కు అనుగుణంగా రూపొందించిన పుస్తకం
ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : అదిలాబాద్(Adilabad) జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్, కామర్స్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్స్(Computer Applications) విభాగానికి చెందిన గజానన్ అంకట్వార్ నూతన సిలబస్‌కు అనుగుణంగా డిగ్రీ విద్యార్థుల ప్రయోజనార్థం “ఫండమెంటల్ ఐటి(Fundamental IT)” కొత్త పుస్తకాన్ని ఆవిష్కరించారు. బీకాం కంప్యూటర్ అప్లికేషన్ ఫస్ట్ ఇయర్‌కు సంబంధించిన “ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ” అనే పుస్తకాన్ని గజానన్(Gajanan) రచించారు.
ఈ పుస్తకాన్ని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతీక్ బేగం(Dr. Atiq Begum) ఆవిష్కరించి అభినందించి ఘనంగా సన్మానించారు. నూతన సిలబస్‌కు అనుగుణంగా రచించిన ఈ పుస్తకం బీకాం ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, మునుముందు రాబోయే ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు కూడా ఉపయోగపడే రీతిలో పుస్తక రచన చేయాలని సూచించారు. సమాచార సాంకేతిక రంగంలో విద్యార్థులు కొత్త ప్రయోగాలతో ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ గణపతి రఘు(Ganapathy Raghu), కృణాల్, ఎన్ సీ సీ కేర్ టేకర్ డాక్టర్ చంద్రకాంత్(NCC Caretaker Dr. Chandrakant), నరేష్, సాద్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.