బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా..
- రెండు దశల్లో పోలింగ్, నవంబర్ 14న కౌంటింగ్
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈసారి బిహార్‌లో ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 6న మొదటి విడత, నవంబర్ 11న రెండో విడత పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపడతారని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ వెల్లడించారు.
మొత్తం 7.43 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనుండగా, 90,712 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్‌లో వెబ్‌క్యాస్టింగ్ సదుపాయం కల్పించనున్నామని పేర్కొన్నారు. బిహార్‌లో 243 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22న ముగియనుంది.