తిరుపతి, ఆగస్టు 27 (ఆంధ్రప్రభ) : తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనార్థం బుధవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మహారాష్ట్ర గవర్నర్, ఎన్ డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ కు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్ లు ఘన స్వాగతం పలికారు.

టీటీడీ చైర్మన్ (TTD Chairman) బీఆర్ నాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, శాప్ చైర్మన్ రవి నాయుడు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాసులు, ప్రజా ప్రతినిధులు (Public representatives) స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, శ్రీకాళహస్తి టీడీపి ప్రతినిధి చెంచయ్య నాయుడు గవర్నర్ కి శ్రీకాళహస్తి కలంకారి చిత్రపటాన్ని అందజేశారు.

Leave a Reply