PEDANA| అందుకే.. ప్రజా దర్బార్..

PEDANA| పెడన, ఆంధ్రప్రభ : ప్రజాసమస్యల పరిష్కార వేదిక ‘ప్రజా దర్బార్‌’ కార్యక్రమాన్ని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. ప్రతి శుక్రవారం ‘ప్రజా దర్బార్‌’ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. పెడన పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్జీదారుల నుంచి పెద్దసంఖ్యలో స్పందన వచ్చింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ప్రతి అర్జీదారుని సమస్యను స్వయంగా విన్నారు. సమస్యను సంబంధిత అధికారికి బదిలీ చేసి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.

Leave a Reply