ఓటీటీలోకి ఆ త్రిల్లర్ మూవీ..
హైదరాబాద్, ఆంధ్రఫ్రభ : సత్యరాజ్, ఉదయభాను ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం త్రిబాణధారి బార్బరిక్(Three-armed Barbarian). మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు(August)లో విడుదలైంది. తాజాగా ఓటీటీ(OTT) వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.
అక్టోబర్ 10 నుంచి సన్ నెక్ట్స్(Sun Next)లో స్ర్టీమింగ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఇది అందుబాటులో ఉండనున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ విడుదల చేసింది.