ఆ.. చట్టాలు అమలు..
బిక్కనూర్, ఆంధ్రప్రభ – రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య చెప్పారు. బుధవారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవించాలని చెప్పారు. చట్టం ముందు అందరు సమానమే అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామానికి చెందిన మండల మాజీ ఎంపీపీ సుదర్శన్ కుమారుని వివాహం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా ఆయన వారి ఇంటికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

