TDP | అదే ప్రభుత్వ లక్ష్యం..

TDP | అదే ప్రభుత్వ లక్ష్యం..

  • పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ఈ ప్రభుత్వ ధ్యేయం..
  • జిల్లాలో 2.14 లక్షల మంది లబ్ధిదారుల పెన్షన్ పంపిణీకి శ్రీకారం..
  • జిల్లాకు పెన్షన్ పంపిణీ కోసం 92.74 ఓట్లు మంజూరు..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. నంద్యాల జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు ఉదయం 6 గంటలకు పెన్షన్లు పంపిణీకి సచివాలయ ఉద్యోగులు టీడీపీ (TDP) నాయకులు కార్యకర్తలు హాజరై పెన్షన్ల పంపిణీ చేపట్టారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అవ్వ తాతల ముఖంలో వికలాంగుల్లోను ఆనందం చిరునవ్వు చూడాలన్న లక్ష్యంతో పెన్షన్ 2 వేల రూపాయల నుంచి 4 వేల రూపాయలు పెంచిన ఘనత ఉమ్మడి కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర మైనార్టీ న్యాయ శాఖ మంత్రి ఎం ఎం డి ఫరూక్ పేర్కొన్నారు. సోమవారం నంద్యాల జిల్లాలో భీమవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం చేపట్టారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాతో పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, ఎంపీడీవో సుగుణ శ్రీ, సమంత అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రతి నెలా ఒకటో తేదీన (Date) అర్హులైన ప్రతి అభ్యర్థికి పెన్షన్ ఇవ్వటానికి సచివాలయ ఉద్యోగులతో పాటు టీడీపీ కార్యకర్తలు, అధికార ప్రతినిధులు హాజరవ్వటం విశేషం. జిల్లాలో అర్హులైన పెన్షన్దారులు 2.14 లక్షల మంది ఉన్నారని వీరికి 92.74 కోట్లు రూపాయలు ప్రతి నెలా ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీకి ప్రజాప్రతినిధులు టీడీపీ కార్యకర్తలు నామినేటెడ్ పదవులు పొందిన వారు ప్రతి ఒక్కరూ వెళ్లి పెన్షన్ అందుతుందా లేదా కష్టనష్టాలు తెలుసుకోవాలని సూచించారు. ఇందులో వృద్ధాప్య పెన్షన్ వీడియో పెన్షన్ ఒంటరి మహిళ పెన్షన్ తో పాటు వికలాంగుల పెన్షన్లు యువర్ పెన్షన్లు ఫిషరీస్ డప్పు కళాకారులు సైనిక వెల్ఫేర్ అభయ పెన్షన్ల వంటి రకరకాల పెన్షన్లతో అర్హులైన వారికి పెన్షన్లు పంపిణీ చేశారు.

ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ (Super Six) పథకాలతో పాటు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు డీఎస్సీ నిర్వహించి నిరుద్యోగ ఉపాధ్యాయులకు 16,347 పోస్టులకు భర్తీ చేసే ఘనత కూటమి పార్టీకే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం.. ఇటీవల రైతన్న నీ కోసం కార్యక్రమంలో ప్రతి రైతును కలిసి వారి కష్టనష్టాలు తెలుసుకున్నామన్నారు. పంచ సూత్రాలను పాటించి రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశగా ఓ ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తుంది అన్నారు. వికలాంగులు పెన్షన్ రాలేదని ఆందోళన చెందవద్దు అన్నారు. సదరన్ కార్యాలయంలో సర్టిఫికెట్ తెచ్చుకుని దరఖాస్తు చేసుకుంటే అర్హులైన వారికి తిరిగి పెన్షన్ వస్తుందని వారు తెలిపారు.

Leave a Reply