రైతుల కోసం అసెంబ్లీలో గళమెత్తిన కడియం..!

రైతుల కోసం అసెంబ్లీలో గళమెత్తిన కడియం..!
మొక్కజొన్న రైతులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే
వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం
తక్షణమే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు
రైతుల నుంచి ఎమ్మెల్యే శ్రీహరికి కృతజ్ఞతలు వెల్లువ
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : రైతుల సమస్యలపై ఎప్పుడూ ముందుండే స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరోసారి తన నాయకత్వాన్ని చాటుకున్నారు. మొక్క జొన్న రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అసెంబ్లీలో గళమెత్తి ప్రస్తావిస్తూ వారి కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. జీరో అవర్‌లో మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కడియం స్పష్టంగా వివరించారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే ప్రస్తావనకు ప్రభుత్వం తక్షణమే స్పందించడంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది.
మంత్రి స్థాయిలో చర్చలు జరిపి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై వేగంగా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ వ్యవసాయ మార్కెట్‌లో మార్క్‌ఫెడ్ ద్వారా మక్కల కొనుగోళ్లకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. మార్క్‌ఫెడ్ డీఎం రంజిత్ రెడ్డి మార్కెట్ యార్డ్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రైతు లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు నిర్వహించాలని అధికా రులకు సూచించారు.
ఈనెల 23న మక్కల కేంద్రాన్ని ప్రారంభించునున్న ఎమ్మెల్యే:
ఈనెల 23న ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా మక్కల కొనుగో లు కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 14 శాతం లోపు తేమ ఉన్న మక్కలను క్వింటాకు రూ.2400 మద్దతు ధరకు కొనుగోలు చేయనున్నారు. మధ్యవర్తుల దోపిడీకి చెక్ పెట్టేలా నేరుగా కొనుగోళ్లు చేపట్టడం పట్ల రైతులు ఆనం దం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో తమ సమస్యలను గళమెత్తి విని పించిన కడియం శ్రీహరికి రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ప్రత్యేక కృతజ్ఞతలు: వ్యవసాయ మార్కెట్ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి

మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు రైతులకు పెద్ద ఊరటనిస్తుంది. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరి గేలా మార్కెట్ యార్డ్‌లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మొక్కజొన్న రైతుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి, రైతుల సంక్షేమాన్ని దృష్టి లో పెట్టుకుని తక్షణమే నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదములు.

