ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి : ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnanను బీజేపి తమిళనాడు – కర్ణాటక జాతీయ సహ – ఇన్‌చార్జ్ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి(Dr. Ponguleti Sudhakar Reddy) మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ రోజు ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి అధికారిక నివాసం వీపీ ఎన్‌క్లేవ్‌లో ఈ భేటి జరిగింది.

ఈ సందర్బంగా సీపీ రాధాకృష్ణన్ తో తమిళనాడులోని కోయంబత్తూర్ జ్ఞాపకాలను పంచుకున్నట్లు సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో మీడియాకు తెలిపారు. సీపీ రాధాకృష్ణన్ దేశ ఉప రాష్ట్రపతిగా విజయవంతమైన పదవీకాలం గడపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అలాగే దక్షిణాది నుండి ఒక సాధారణ నాయకుడిని దేశ రెండవ అత్యున్నత పదవికి ఎన్నుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. రాధాకృష్ణన్ వంటి మంచి వ్యక్తికి ఉపరాష్ట్రపతి(Vice President)గా అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు అని తెలిపారు.

Leave a Reply