హైదరాబాద్ – తెలంగాణ గ్రూప్-3 ఫలితాలను శుక్రవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ సందర్భంగా జనరల్ ర్యాంకింగ్స్‌ను సైతం విడుదల చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ఫలితాలను చైర్మన్ బుర్రా వెంకటేశం శుక్రవారం విడుదల చేశారు. గ్రూప్-3లో పురుషుల్లో టాప్ ర్యాంకర్‌కు 339.24 మార్కులు మహిళా టాప్ ర్యాంకర్‌కు 325.15 మార్కులు వచ్చినట్లు తెలిపింది. మొదటి 36 ర్యాంకుల్లో ఒకే ఒక మహిళా అభ్యర్థి ఉన్నట్లు చెప్పింది.
మొదటి 50 ర్యాంకుల్లో నలుగురు మాత్రమే మహిళా అభ్యర్థులు ఉన్నారు. గ్రూప్-3 అభ్యర్థుల లాగిన్ ఐడీలతో లాగినై.. ఓఎంఆర్‌షీట్లు షీట్లు చూసుకోవచ్చని చెప్పింది. 2,49,557 మంది అభ్యర్థుల జనరల్ ర్యాంక్స్‌ని రిలీజ్ చేసింది. రాష్ట్రంలో మొత్తం 1,365 గ్రూప్-3 సర్వీసుల పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ -3 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలకు 5,36,400 మంది దరఖాస్తు చేయగా, 2,69,483 (50.24శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు.