కౌన్సిలర్లకు సన్మానం..

కౌన్సిలర్లకు సన్మానం..

ఉగాది పురస్కారాలు అందజేత

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ పట్టణంలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో శ్రీ పరాభవ నామ ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చౌటుప్పల్ పురపాలక సంఘం నూతన చైర్ పర్సన్, పాలకవర్గమునకు ఆత్మీయ అభినందన సత్కారం చేసి ఉగాది పురస్కారాలను అందజేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ ఛైర్మన్ గోశిక వినయ్ కుమార్, 1వ వార్డ్ కౌన్సిలర్ కొసనం రాకేష్ రెడ్డి, 2వ వార్డ్ కౌన్సిలర్ పోలేపల్లి లక్ష్మీ ముత్తయ్య, 3వ వార్డు కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, 4వ వార్డ్ కౌన్సిలర్ ఊదరి యాదయ్య, 5వ వార్డ్ కౌన్సిలర్ కొయ్యడ శేఖర్, 6వ వార్డు కౌన్సిలర్ ఆలే శ్రీలత చిరంజీవి, 7వ వార్డు కౌన్సిలర్ కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, 8వ వార్డు కౌన్సిలర్ బద్రి గాలయ్య,10వ వార్డు కౌన్సిలర్ దేప రమ్య రాజు, 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి, 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ కుమార్ గౌడ్, 14వ వార్డు కౌన్సిలర్ ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్, 15వ వార్డు కౌన్సిలర్ గడ్డం ఇందిర రాజారత్నం, 16వ వార్డ్ కౌన్సిలర్ బత్తుల జయమ్మ దాసు గౌడ్, 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు, 18వ వార్డు కౌన్సిలర్ బుడ్డ సురేష్, 19వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్, 20వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ హన్ను లకు దేవస్థానం తరఫున ఆత్మీయ అభినందన సత్కారం, ఉగాది పురస్కారములను అందజేశారు.

శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవస్థాన కమిటి అధ్యక్షులు బడుగు జయప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ ప్రధాన కార్యదర్శి గోశిక బాల నరసింహ, దేవస్థాన ధర్మకర్తలు బడుగు లక్ష్మయ్య, చిక్క నరసింహ, గోశిక అంజయ్య, శ్రీ బడుగు శ్రీరాములు, శ్రీ గుర్రం వెంకటేశం, వనం ధనుంజయ, గుర్రం పాండురంగ, గోశిక నరసింహ, దేవస్థాన కమిటీ ఉపాధ్యక్షులు నోముల రఘునాథ్, గోశిక బాలాజీ, సహాయ కార్యదర్శి గోలి శ్రీనివాస్, గోశిక చంద్రకళ నరసింహ, కోశాధికారి శ్రీమతి బడుగు సుజాత నర్సింహ, సాంస్కృతిక కార్యదర్శి బడుగు క్రాంతి కుమార్, ప్రచార కార్యదర్శి కర్నాటి జనార్ధన్, సమన్వయ కార్యదర్శి బాల్యం అనిల్ కుమార్ తో పాటు మరుద్వతి దేవస్థాన కమిటి అధ్యక్షులు గుర్రం నరసింహ, శ్రీ భావనారుషి కళానికేతన్ అధ్యక్షులు బడుగు బాలరాజు, క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్ అధ్యక్షులు కర్నాటి శ్యామ్, దేవస్థాన ప్రధాన అర్చకులు గంజి నరసింహులు శర్మ, గంజి అనంతరామ కిరీటి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply