TG | కడియం సక్సెస్.. ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ ప్రభంజనం..

TG | కడియం సక్సెస్.. ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ ప్రభంజనం..
- -పట్టణాభివృద్ధికి పట్టం…నాయకత్వానికి ప్రజల మద్దతు…
- -ప్రచారంలో ఎమ్మెల్యే కడియంతో పాటు ఎంపీ కావ్య ప్రత్యేక శ్రద్ధ..
- -నమ్మకానికి ముద్ర వేసిన ఘన్‌పూర్ మున్సిపల్ ఓటర్లు..
TG | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయాల్లో మొట్టమొదటి సారి జరిగిన మున్సి పల్ ఎన్నికలు కేవలం స్థానిక పోటీగా కాకుండా నాయకత్వం పై నమ్మ కానికి జరిగిన కీలక పరీక్షగా మారాయి. ఆ పరీక్షలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘన విజయం సాధించారు. పట్టణ అభివృద్ధి కోసం ఆయన రూపొందించిన ప్రణాళికలు, ప్రజలతో కలిసిన నడక, సమస్యల పరిష్కారంలో చూపిన చురుకుదనం, రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న సమన్వయం ఇవన్నీ కలిపి కాంగ్రెస్ పార్టీకి భారీ విజయాన్ని అందించాయి. అందుకే అభివృద్ధినే ఎంచుకున్నారు.. ప్రజలు నమ్మకానికే ఓటేశారు.
ఈ విజయానికి మరో ప్రధాన కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయాలు. తెలంగాణను అభివృద్ధి పథంలో దూసుకెళ్లించాలనే సంకల్పంతో పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పై ప్రజల్లో ఏర్పడిన విశ్వాసం మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిఫలించింది. ముఖ్యమంత్రి సహకారంతో స్టేషన్ ఘన్ పూర్‌కు అధిక నిధులు రప్పించడం, పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేకతగా నిలిచింది. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు వంటి అంశాల్లో సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగడం ఆయన పని తీరుకు నిదర్శనం. అభివృద్ధే మా అజెండా అన్న నినాదాన్ని కేవలం మాటల్లో కాకుండా కార్యాచరణలో చూపించగలిగారు. ప్రజల సమస్యలు వినడమే కాకుండా వాటికి తక్షణ పరిష్కారం చూపే నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.

తండ్రి బాటలో తనయురాలు..
ప్రచారంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు ఎంపీ కావ్య కూడా ప్రత్యేక శ్రద్ధ చూపారు. తండ్రి బాటలో తనయురాలు నడుస్తూ ప్రతి వార్డులో పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించడం, ఇంటింటికీ ప్రచారం చేయడం, ప్రభుత్వ పథకాల పై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కావ్య సమన్వ యంతో రూపొందించిన వ్యూహం మున్సిపల్ ఎన్నికల్లోకాంగ్రెస్ జెండా విజయకేతనం ఎగురవేసింది.
-ప్రజాభిమానానికి నిదర్శనం కడియం:
పట్టణ ఓటర్లు కేవలం అభ్యర్థులను మాత్రమే కాకుండా అభివృద్ధి దిశగా నడిపించే నాయకత్వాన్ని ఎంచుకున్నారని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి. కడియం శ్రీహరి పై ప్రజలకు ఉన్న నమ్మకం, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉన్న విశ్వాసం మరింత బలపడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక స్థాయిలో కూడా ప్రభావం చూపుతున్నాయనే సంకేతాన్ని ఈ ఫలితాలు తెలి యజేశాయి. మొత్తానికి ఇది కేవలం ఎన్నికల విజయం మాత్రమే కాదు.
అభివృద్ధి పై నమ్మకానికి, నాయకత్వం పై విశ్వాసానికి, కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉన్న ప్రజాభిమానానికి వచ్చిన ముద్ర.. స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయాల్లో కడియం శ్రీహరి మరోసారి తన ముద్ర వేసిన ఘట్టంగా ఈ ఎన్నికలు చరిత్రలో నిలిచిపోనున్నాయి.
