TG | ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నాం : మంత్రి వివేక్ వెంకటస్వామి

చెన్నూర్, ఆంధ్రప్రభ: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేస్తుందని రాష్ట్ర కార్మిక, గనుల ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.

ఆదివారం చెన్నూర్ మండలం కిష్టంపేటలో ఏర్పాటు చేసిన ‘ఇందిరా మహిళా శక్తి సంబరాలు’ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేయగా, స్వయంశక్తి మహిళా సంఘాలకు రూ.25 కోట్లు విలువైన వడ్డీలేని రుణాల చెక్కులను అందజేశారు.

గత ప్రభుత్వం మహిళలను నిర్లక్ష్యం చేసింది.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తామని చెప్పి విస్మరించిందని, మహిళలను కోటీశ్వరులను చేస్తానని కేసీఆర్ ఒక్కడే కోటీశ్వరుడు అయ్యాడని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు నిధులు వృధా చేసి కాంట్రాక్టర్లను ధనవంతులుగా మార్చిన విషయాన్ని గుర్తు చేశారు.

మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్థిక సాదికారతకు పెద్ద పీట వేసిందని, జిల్లాలోని 246 స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేసి కొత్త మార్గాన్ని చూపిస్తోందన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను కూడా సమర్థంగా అందిస్తుందని వివరించారు.

నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు

భివృద్ధి ప్రాధాన్యతలో భాగంగా మండలంలోని సోమనపెల్లి గ్రామంలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టామని, గత 18 నెలల్లో 500 మందికి సీఎం రిలీఫ్ ఫండ్, నియోజకవర్గంలో 8,000 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని తెలిపారు. విద్య, వైద్యం రంగాలను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని, చెన్నూరులో బస్ డిపో నిర్మాణం కోసం రవాణా మంత్రికి ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు.

Leave a Reply