గోవిందరావుపేట, ఏప్రిల్ 8 (ఆంధ్రప్రభ)మృదుల గోవిందరావుపేట మండలంలో ఈదురు గాలులు విలయతాండవం చేశాయి. కంటిరెప్ప కొట్టేంత లోపే గాలివాన బీభత్సాన్ని సృష్టించింది.ఒక్కరోజు క్రితం వరకు పచ్చటి పంటలతో కళకళలాడిన గ్రామాలు వడ్ల గింజలు రాలిపోయి చెల్లాచెదిరై కనిపిస్తున్నాయి.

సోమవారం సాయంత్రం 6 గంటల సమీపంలో వచ్చిన ఈదురు గాలి, వడగండ్ల వర్షం కేవలం చెట్లనే కాదు, ప్రజల ఆశల్ని కూడా నేలకొరిగించింది. భారీ గాలులు వడగండ్ల వర్షంతో ప్రజలు భయంతో ఆందోళనకు గురయ్యారు. ఈనెల 3న భారీ వర్షం వడగండ్ల వానకు చాలా వరి పొలాలు దెబ్బతిన్నాయి. మిగిలిన పంట నైనా కోసుకుందాం అనేసరికి భారీ గాలులు వడగండ్ల వర్షానికి పంట పూర్తిగా దెబ్బతినిపోయింది.

రాళ్ల వర్షానికి వరి గింజలు మొత్తం నేలరాలాయి. రైతుల పాలిట పకృతి శాపంగా మారింది. మండలంలోని చాలా గ్రామాలలో రేకులు, పూరి గుడిసెల ఇల్లు చాలా వరకు దెబ్బ తిన్నాయి. ఇంటిపై రేకులు లేచిపోయి ఎక్కడో దూరంగా పడిపోయాయి. చాలా గ్రామాల్లో ఈదురుగాళ్లకు ఇండ్లపై చెట్లు కూడా కులాయి.
మేడారం పస్రా రహదారిలో గాలులకు చెట్లు విరిగిపడ్డాయి. ఈ క్రమంలో పసర ఎస్ఐ కమలాకర్ చెట్లను తొలగించారు. కోటగడ్డ గ్రామానికి చెందిన పసునూరి రాంబాబు అనే రైతు యాసంగిలో వేయి పది పంటను సాగు చేశాడు నిన్న సాయంత్రం కురిసిన వడగండ్ల వర్షానికి వరి గింజలు మొత్తం నేలరాలాయి దాదాపుగా నాలుగు లక్షల పెట్టుబడి పెట్టి నష్టపోయానని రైతు ఆవేదన చెందాడు.