TG | మర్రిచెట్టు సన్నిధిలో మేశ్రమ వంశీయులు..

TG | మర్రిచెట్టు సన్నిధిలో మేశ్రమ వంశీయులు..

TG, ఇంద్రవెల్లి 15, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించారు. ప్రభుత్వపరంగా ఐటీడీఏ సహకారంతో అన్ని సౌకర్యాలతో ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు మూడు రోజుల పాటు మర్రి చెట్టు నీడలో మేస్రం వంశీయులు బస చేస్తున్నారు. గురువారం మహిళలు తెల్లవారుజాము నుండి తమ తమ స్థావరాల వద్ద పరిశుభ్రతతో పూజా సామాగ్రిని అమర్చి ఆయా గుడుల వద్ద దీపం పెట్టారు.

మర్రిచెట్టు వద్ద ఉన్న దేవతకు పూజించారు. అలాగే సాయంత్రం కాలికోం, డోల్, వాయిద్యాలతో, మేశ్రమ వంశీయుల పటేళ్ల కుటుంబీకులకు తమ స్థావరాల వద్దకు ఆహ్వానించి వీరి ఆశీస్సులతో, ఆనవాయితీగా వస్తున్న వివిధ రకాల పూజలతో పాటు తమ పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి తూం పూజ వివిధ కార్యక్రమాలకు, ప్రణాళికలను చర్చించి మర్రిచెట్టు స్థావరం వద్దనే పలు సలహా00 సూచనలను ఇవ్వడం జరుగుతుంది. మర్రిచెట్టు స్థావరం వద్ద పటేల్ వంశీయులు పాల్గొన్నారు. మగవారు, ఆడవారు తెల్ల దుస్తులతో పూజలు నిర్వహించారు. ఇది చూసేవారికి కనుల పండుగలా అనిపించింది.

పటేల్ వంశీయుల ఆర్థిక అభివృద్ధి..
మేశ్రమం స్తుతుల ఆర్థిక అభివృద్ధి నిమిత్తం, నానా సమస్యలకు, పటేల్ వంశమే నిలబడి వారికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. ఈ ఆర్థిక సాయంలో పటేల్ వంశీయులు కుటుంబానికి వేయి రూపాయల చొప్పున జతపరిచి అవసరం ఉన్నవారికి వెయ్యి రూపాయలకు సంవత్సరం పాటు వడ్డీ 300తో ఇవ్వవలసిందిగా సూచిస్తారు. ఈ 1300 రూపాయలతో వచ్చిన ఆదాయాన్ని వీరి వంశంలోనే కుటుంబీకులకు పంచుకుంటారు. ఇదే ప్రక్రియను యధావిధిగా వెయ్యి రూపాయలతో జతపరిచి కొనసాగిస్తారు. పటేల్ వంశమే కాకుండా అత్యావసరం ఉన్నవారు కూడా దీనిని స్వీకరిస్తారు కానీ ఈ ప్రక్రియను కొనసాగించేది పటేల్ వంశం మాత్రమే. ఏదేమైనా మేశ్రమ వంశీయులు తమ వంశం కొరకు ఒకరికి ఒకరు సహాయ పడడం అనేది ఆనవాయితీగా వస్తుంది.

Leave a Reply