TG TET-2026 | పరీక్షల షెడ్యూల్ విడుదల..

TG TET-2026 | పరీక్షల షెడ్యూల్ విడుదల..
TG TET-2026 | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో ఉపాధ్యాయ అభ్యర్థులకు కీలకమైన టెట్ పరీక్షలపై ఉన్నత విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. 2026 జనవరిలో నిర్వహించనున్న టెట్ పరీక్షలకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ను విడుదల చేస్తూ, కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రెండు సెషన్లలో జరగనున్న ఈ పరీక్షలు కేవలం 9 రోజుల్లో పూర్తి చేయనున్నారు.
ప్రతిరోజు పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయి. మొదటి సెషన్ (ఉదయం): ఉదయం 9:00 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ (మధ్యాహ్నం): మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు జరగనుంది.
తెలంగాణ టెట్ ఎగ్జామ్ 2026 షెడ్యూల్ ఇదే..
జనవరి 3న రెండు సెషన్స్ లో మ్యాథమాటిక్స్ అండ్ సైన్స్ పేపర్ 2 పరీక్ష
జనవరి 4న రెండు సెషన్స్ లో మ్యాథమాటిక్స్ అండ్ సైన్స్ పేపర్ 2 పరీక్ష
జనవరి 5న రెండు సెషన్స్ లో సోషల్ స్టడీస్ పేపర్ 2 పరీక్ష
జనవరి 6న రెండు సెషన్స్ లో సోషల్ స్టడీస్ పేపర్ 2 పరీక్ష
జనవరి 8న రెండు సెషన్స్ లో పేపర్-1 పరీక్ష
జనవరి 9న పేపర్-1 పరీక్ష (ఒక్క సెషన్ మాత్రమే)
జనవరి 11న రెండు సెషన్స్ లో పేపర్-1 పరీక్ష
జనవరి 19న పేపర్-1 (మైనర్) పరీక్ష (ఒక్క సెషన్ మాత్రమే)
జనవరి 20 పేపర్-2 పరీక్ష మ్యాథమాటిక్స్ అండ్ సైన్స్స సోషల్ స్టడీస్ (ఒక్క సెషన్ మాత్రమే).
