TG | అవయవ దానాల్లో తెలంగాణ టాప్ !!

తెలంగాణ రాష్ట్రం అవయవ దానాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలకన్నా ముందంజలో ఉంది. రాష్ట్రంలో నిర్వహిస్తున్న ‘జీవన్ దాన్’ కార్యక్రమంతో తెలంగాణ జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని సాధించింది. ఈ ఘనతను గుర్తించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ జీవన్ దాన్ అధికారులకు అవార్డు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో నేషనల్ ఆర్గాన్ అండ్ ఇష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (NOTTO) ప్రకటించిన గణాంకాల ప్రకారం, తెలంగాణ రాష్ట్రం మిలియన్ జనాభాకు 4.88 రేటుతో దేశంలోనే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. జాతీయ సగటు కేవలం 0.8గా ఉండగా, తెలంగాణ దాన్ని ఐదు రెట్లు మించి నిలవడం విశేషం. అందుకే తెలంగాణకు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చేతుల మీదుగా ప్రత్యేక అవార్డు లభించింది.

2012లో ప్రారంభమైన జీవన్ దాన్ కార్యక్రమం ఇప్పటివరకు 673 డోనర్ల నుండి సేకరించిన అవయవాలతో 6309 మందికి ప్రాణాలు నిలిపింది. బ్రెయిన్ డెత్ అయినవారి అవయవాలను గుర్తించి, కుటుంబ సభ్యులను ఒప్పించి, అవసరమైన వారికి వాటిని వేగంగా అందించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోంది.

Leave a Reply