TG | ఆరు పంచాయతీలు ఏకగ్రీవం..
TG, పెద్దవంగర, ఆంధ్రప్రభ : పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ శనివారం ముగిసింది. పెద్దవంగర మండల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ (Congress Party) బలపరిచిన ఆరు గ్రామపంచాయతీల అభ్యర్థులు సర్పంచ్ గా ఏకగ్రీవమయ్యాయి. మండల పరిధిలోని 26 గ్రామపంచాయతీలకు గాను జయరామ్ తండా, వంపు తండా, కండ్యా తండా, రామోజీ తండా, టీక్యా తండా, బొత్తల తండా గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. జయరామ్ తండా నుండి బానోత్ విజయ సోమన్న ఒకే నామినేషన్ దాఖలు కాగా ఏకగ్రీవమయింది.
వంపు తండా నుండి ధరావత్ వినోద రమేష్ ఒకే నామినేషన్ దాఖలు కాగా ఏకగ్రీవమయింది. కండ్యా తండా నుండి ధరావత్ శంకర్ సర్పంచ్ గా, రామోజీ తండా గ్రామపంచాయతీ నుండి గుగులోత్ మాలిక, టీక్యా తండా జాటోత్ దివ్యభారతి, బొత్తల తండా నుండి జాటోత్ కల్పన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా గెలిచిన సర్పంచులతో పాటు వార్డు సభ్యులను ఆయా గ్రామస్తులు అభినందించారు. మిగిలిన 20 గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులు బరిలో ఉండగా వారికి రిటర్నింగ్ అధికారులు గుర్తులను కేటాయించారు.

