TG – ఫోన్ ట్యాపింగ్ కేసు..ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కు బెయిల్ ..
హైదబాద్, ఆంధ్రప్రభః ఫోన్ ట్యాపింగ్ కేసు లో మరో మరో నిందితుడికి బెయిల్ లభించింది..ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఎ 2 నిందితుడు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై పలు దఫాలుగా విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం నేడు తీర్పును వెలవరించింది. ఈ ఆయనకు కొన్నిషరతులతో రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశలిచ్చింది.
కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో నలుగురిని గత ఏడాదిలో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.. అడిషనల్ ఎస్పీ ప్రణీత్ రావ్, అడిషనల్ ఎస్పీ భుజంగ రావ్, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావ్ లను పోలీసులు అరెస్ట్ చేసారు.. ఇప్పటికే ఈ కేసులో నిందితులైన భుజంగరావు, తిరుతన్న, రాధాకిషన్ రావులకు ఇప్పటికే బెయిల్ మంజూరు కాగా, తాజాగా ప్రణీత్ కూడా బెయిల్ లభించింది..