TG | ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

TG | ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

TG, మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. బుధవారం ఆత్మకూరు మండలంలో ప్రవేశించిన పెద్దపులి పల్లెపహాడ్, పారుపల్లి గ్రామాల పరిధిలోకి ప్రవేశించిందని ఫారెస్ట్ అధికారులు తెలిపినట్లు, మోత్కూర్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ వెంకటేశ్వర్లు కోరారు.

ఆత్మకూరు మండలానికి పక్కనే ఉన్న మోత్కూరు మండలానికి సైతం పులి ఎప్పుడైనా రావచ్చని, మోత్కూరు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండి బావుల దగ్గరికి రాత్రి సమయంలో వెళ్లకుండా జాగ్రత్తగా ఉండి, బావుల దగ్గరలో ఉన్న పశువులని, గొర్రెలని కూడా ఇంటికి తరలించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పులి గురించి ఎలాంటి సమాచారం అందినా పోలీసు అధికారులకి, ఫారెస్ట్ అధికారులకు, డయల్ 100కి వెంటనే తెలియజేయాలని సీఐ వెంకటేశ్వర్లు కోరారు.

Leave a Reply