TG | ఎస్ఆర్ఎస్ గ‌డువు పొడిగించిన ప్ర‌భుత్వం

హైదరాబాద్: లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎస్ఆర్ఎస్) రాయితీ గడువును తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. గత నాలుగేళ్లుగా పెండింగులో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించిన విషయం తెలిసిందే. ఎల్ఆర్ఎస్ ఫీజును 25% రాయితీతో చెల్లించేందుకు మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. తాజాగా ఆ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాయితీపై ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించినప్పటికీ ఆశించిన మేర రిజిస్ట్రేషన్లు జరగలేదు. ప్రజల నుంచి ప్రభుత్వం అనుకున్నంతమేర స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పొడిగింపు ఈ నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *