TG | ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ పోస్టింగ్ లో మార్పు

హైద‌రాబాద్ : ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ పోస్టింగ్‌లో రేవంత్ రెడ్డి స‌ర్కార్ స్వ‌ల్ప మార్పు చేసింది. శ‌శాంక్ గోయ‌ల్‌ను ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ ప్ర‌త్యేక సీఎస్‌గా నియ‌మిస్తూ బుధ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇటీవ‌ల శశాంక్ గోయ‌ల్‌ను సీజీజీ డీజీగా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆ పోస్టింగ్‌ను మార్చుతూ ఆయ‌న‌కు ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ ప్ర‌త్యేక సీఎస్‌గా పోస్టింగ్ ఇచ్చింది.

ఇక సీఎం కార్య‌ద‌ర్శిగా ఉన్న షాన‌వాజ్ ఖాసీం కూడా బ‌దిలీ అయ్యారు. ఆయ‌న‌ను డ్ర‌గ్ కంట్రోల్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌గా ప్ర‌భుత్వం నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో పాటు ఎక్సైజ్ డైరెక్ట‌ర్‌గా అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించింది

Leave a Reply