హైదరాబాద్ – కాళేశ్వరం కమిషన్ (Kaleswaram Commission) విచారణకు బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) నేడు హాజరయ్యారు.. నేటి ఉదయం ఉ.11:00కి బీఆర్‌కే భవన్ (BRK Bhavan) కు ఆయన చేరుకున్నారు.. ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ (Erravalli Farm House) నుంచి బయలు దేరిన ఆయన నేరుగా విచారణ జరిగే బిఆర్కె భవన్ కు చేరుకున్నారు.. ఆయన వెంట భారీ కాన్వాయ్ కూడా అనుసరించింది.. కెసిఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తదితర ప్రముఖులు ఉన్నారు. ఇక కేసీఆర్ వెంట హరీష్‌రావు,(Harishrao ) ప్రశాంత్‌రెడ్డి (prasanthreddy ) తో పాటు మరో ఏడు మంది బిఆర్కే భవన్ లోకి అనుమతించారు..
కాగా ఈ విచారణ సందర్భంగా బీఆర్‌కే భవన్ దగ్గర పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. బిఆర్కే భవన్ వెళ్లే మార్గాలను మూసి వేసి ఇతర వాహనాలను దారి మళ్లించారు.. మరికొద్ది సేపట్లో జస్టిట్ పిసి ఘోస్ విచారణ ప్రారంభించనున్నారు..



