TG | బిఆర్ఎస్ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టిన క‌విత.. బిసి ఆర్డినెన్స్ సబబేనని ప్ర‌క‌ట‌న

హైద‌రాబాద్ – స్థానిక సంస్థల్లో బీసీలకు (BC) 42 శాతం రిజర్వేషన్లపై (reserations ) ప్రభుత్వ ఆర్డినెన్స్ (ordinance ) సరైందనేనని జనజాగృతి (jana jagruthi ) వ్య‌వ‌స్థాప‌కురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఆర్డినెన్స్ వద్దని బీఆర్ఎస్ నేతలు చెప్పడం తప్పని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిపుణులతో చర్చించాకే తాను ఆర్డినెన్స్‌కు మద్దతు ఇచ్చానని అన్నారు. హైద‌రాబాద్ (hyderabad ) లో ఆమె నేడు మీడియాతో(media ) మాట్లాడుతూ, మల్లన్న (mallanna ) వ్యాఖ్యలపై బీఆర్ఎస్ (brs ) స్పందించలేదని.. ఆ అంశాన్ని పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నానని కవిత అన్నారు.. బిసి రిజ‌ర్వేష‌న్ ల విష‌యంలో చివరికి బీఆర్ఎస్ వాళ్లు నా దారికి రావాల్సిందేనని తెలిపారు.

రేవంత్ పై విమ‌ర్శ‌..

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై ఢిల్లీలో కేంద్ర జలశక్తి నిర్వహించిన మీటింగ్‌లో పాల్గొనడానికి సిగ్గు, పౌరుషం లేదా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్ర‌శ్నించారు.. . బనకచర్ల అంశంపై తాము చర్చలకు వెళ్లేది లేదని మొదట సీఎం రేవంత్ మేకపోతు గాభీర్యం చూపారని.. కానీ, దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా ఢిల్లీకి వెళ్లి ఏపీతో చర్చల్లో పాల్గొన్నారని ఫైర్ అయ్యారు. పైగా సమావేశంలో ఏపీ సీఎం చంద్రాబాబును మంత్రి ఉత్తమ్, సీఎం రేవంత్ రెడ్డి ఎదుర్కొని పండగ వాతావరణంలో సన్మానాలు చేశారని కవిత మండిపడ్డారు.

చంద్ర‌బాబుకి బ‌నక‌చ‌ర్ల గిఫ్ట్ ..
జలశక్తి మీటింగ్ అజెండాలో తొలి అంశమే బనచర్లపై ఉంటే.. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సమావేశాన్ని బహిష్కరించాల్సింది పోయి తీరిగ్గా కూర్చొని అప్పనంగా కృష్ణా, గోదావరి జలాలను ఏపీకి గిఫ్ట్ కింద ఇచ్చేశారని ఆరోపించారు. ఒకవేళ గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణమే జరిగితే.. గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులు శాశ్వతంగా హరించిపోతాయని అన్నారు. జలశక్తి సమావేశంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఓ ప్రెస్ నోట్ ఇచ్చిందని అందులో క్లియర్‌గా బనకచర్లపై చర్చ జరిగినట్లుగా ఉందన్నారు. కానీ, సీఎం రేవంత్ అసలు మీటింగ్‌లో బనకచర్ల ప్రస్తావనే రాలేదని బుకాయించడం వెనుక కుట్ర దాగి ఉందని కవిత అన్నారు.

ఆ నాలుగు పాతవే ..

జలశక్తి మీటింగ్‌లో సీఎం నాలుగు విజయాలు సాధించామని గొప్పలు చెబుతున్నారని.. అందులో కొత్తవి ఏమి లేవని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రాజెక్టుల వద్ద టెలిమెట్రీ పరికారాలు ఏర్పాటు చేసే అంశం ఇప్పటిది కాదని.. ఫేజ్-1 పనులు ఎప్పుడో ప్రారంభం అయ్యాయని, ఇది ఫేజ్-2 అని తెలిపారు. ఇక కేఆర్ఎంబీ కార్యాలయం ఆంధ్రాలో, గోదావరి రివర్ బోర్డు తెలంగాణలో ఉండే అంశం విభజన చట్టంలో ఉన్నదేనని అన్నారు. అదేవిధంగా ఆంధ్రా భూభాగంలో శ్రీశైలం ప్రాజెక్టుకు మరమ్మతులు ఆ రాష్ట్రం, తెలంగాణలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మరమ్మతులు మనం చేయాలని విభజన చట్టంలో పొందుపరిచారని వివరించారు. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి తమ విజయాలుగా చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఆఫీసర్స్ కమిటీ నదుల అనుసంధానంపై ఏర్పాటు చేశారని.. ఇందులో కొత్తగా తెలంగాణకు తీవ్ర నష్టం చేకూర్చే బనకచర్ల ప్రాజక్టు వచ్చి చేరిందని కామెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏం లేదని తెలంగాణ జల హక్కులను చంద్రబాబు కాళ్ల దగ్గర పెట్టి రావడం ఒక్కటే కొత్తదనమని ఎద్దేవా కవిత చేశారు.

Leave a Reply