TG | సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జర్నలిస్ట్ రానా అయ్యూబ్‌..

హైదరాబాద్ : ప్రముఖ దర్యాప్తు జర్నలిస్ట్, రచయిత రానా అయ్యూబ్‌ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లో కలిశారు. భారతదేశం సంబంధించిన రాజకీయ, సామాజిక అంశాలపై రాసే తన తదుపరి పుస్తకానికి సంబంధించిన సమాచారం సేకరణలో భాగంగా ఈ సమావేశం జరిగినట్లు సమాచారం.

వాషింగ్టన్ పోస్ట్ అభిప్రాయ కాలమిస్టుగా పనిచేస్తున్న రాణా అయూబ్ తన మునుపటి పుస్తకం “గుజరాత్ ఫైల్స్: అనాటమీ ఆఫ్ ఎ కవర్-అప్”తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆమె ప్రస్తుతం రాస్తున్న కొత్త పుస్తకంలో దేశ రాష్ట్రాల పాలన, ప్రజల సమస్యలు, రాజకీయ నాయకుల దృక్పథాలను లోతుగా పరిశీలించాలనే ఉద్దేశ్యంతో ఈ భేటీ జరిపినట్లు తులుస్తోంది.

Leave a Reply