TG | సర్కార్ కీలక నిర్ణయం…

TG | సర్కార్ కీలక నిర్ణయం…
TG | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ రాజకీయాల్లో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఉప సర్పంచులకు ఇప్పటివరకు ఉన్న ‘జాయింట్ చెక్ పవర్’ను (Joint Check Power) పూర్తిగా రద్దు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) తీసుకున్న తాజా నిర్ణయం గ్రామ స్థాయి రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడిప్పుడే ఎన్నికై, తమ పదవిలో చక్రం తిప్పాలని ఆశపడిన వేలాది మంది ఉప సర్పంచులకు ఈ నిర్ణయం గట్టి ఎదురుదెబ్బగా మారింది. గ్రామ పంచాయతీ నిధుల వినియోగంలో ఉప సర్పంచులకు ఉన్న జాయింట్ చెక్ పవర్ ను రద్దు చేస్తూ ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) తర్వాత కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. చాలా గ్రామాల్లో సర్పంచ్ పదవికి , ఉప సర్పంచ్ పదవికి తీవ్రమైన పోటీ నెలకొంది. ప్రత్యేకించి ఉప సర్పంచ్ పదవి పొందితే.. నిధుల వినియోగంలో తమ సంతకం కూడా కీలకం అవుతుందని, తద్వారా గ్రామంలో తమ పలుకుబడి పెరుగుతుందని చాలా మంది వార్డు సభ్యులు భావించారు.
