TG | ప్రజా గొంతుకు ఆపడం ఎవరి తరం కాదు – మాజీ మంత్రి , ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

పెన్ పహాడ్ , ఆంధ్ర‌ప్ర‌భ : ప్రజా గొంతుకనైన త‌న‌ను ఆపేతరం ఎవరికి లేదని, ప్రజా సమస్యలపై 13వ ఏటా నుండే ఉద్యమాల్లో పాల్గొన్నానని మాజీమంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు మంగళవారం పెన్ పహాడ్ మండల పరిధిలోని దుబ్బ తండ, మెగ్యా తండా గ్రామాల్లోని ఎస్సారెస్పీ కాలువ కింద సాగుచేసి ఎండిపోయిన పంట పొలాలను ఆయ‌న ప‌రిశీలించారు. ప్రభుత్వానికి రైతుల గోడు పట్టడం లేదని మండిప‌డ్డారు. అసెంబ్లీలో రుణమాఫీ రైతు భరోసా, ఆత్మీయ భరోసా ఎన్నికలకు ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీలతోపాటు 420 హామీలపై మాట్లాడినందుకే తనను సస్పెండ్ చేశారని చెప్పారు. కేసీఆర్‌ పాలనలో మండలం లోని చివరి భూముల వరకు కాళేశ్వ‌రం జలాలను ఎస్సారెస్పీ కాలువల ద్వారా రెండు పంటలకు నీటిని అందించడం వల్ల అత్యధికంగా సాగు జ‌రిగింద‌ని చెప్పారు.

ఎండిన పంట‌లు ప‌రిశీలిస్తే అర్థ‌మ‌వుతుంది


ఎండిపోయిన పొలాలను రైతుల బాధలను స్వయంగా వచ్చి చూస్తే తప్ప సీఎం రేవంత్ రెడ్డి కి అర్థం కాదని జ‌గదీష్ రెడ్డి అన్నారు. నోటికొచ్చిన మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నారని అన్నారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి మాట్లాడి గ్రామాలకు చెందిన రైతులు నునవత్ అఖిల్, ముఖ్య లింగ 10 ఎకరాల ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ముఖ్యమంత్రి కి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే కాలం వస్తుందని అన్నారు. ఒక గొంతును మూయాలని ప్రయత్నం చేస్తే .. రాష్ట్రంలో వేల లక్షల గొంతుకలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్. మాజీ ఎంపీపీ నెమ్మాది బిక్షం. మండల పార్టీ అధ్యక్షులు దొంగరి యుగేందర్ . పిఎసిఎస్ చైర్మన్ వెన్న సీతారామరెడ్డి , నాయకులు భూముల ఇంద్రసేనారావు , మిర్యాల వెంకటేశ్వర్లు , బిట్టు నాగేశ్వరరావు, కొండేటి సుధాకర్, షేక్ షరీఫుద్దీ , నేమ్మాది నగేష్ బూఖ్య సైదా నాయక్, జతు నాయక్ రాధాకృష్ణ గోపి, సైదులుపాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *