TG ICET 2026 | Notification: Feb 12 నుంచి దరఖాస్తులు May 13,14న పరీక్ష

TG ICET 2026 |Notification: Feb 12 నుంచి దరఖాస్తులు May 13,14న పరీక్ష

TG ICET 2026 | TG ICET 2026 షెడ్యూల్ వివరాలు
MBA, MCA ప్రవేశాలకు మే 13, 14న TG ICET పరీక్షలు
TG ICET 2026 దరఖాస్తు ఫీజు వివరాలు
TG EdCET 2026 నోటిఫికేషన్ తేదీలు

మరో వారంలో..

టీజీ ఐసెట్ నోటిఫికేషన్

ఫిబ్రవరి 12 నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీక‌ర‌ణ‌

మార్చి 16 వరకు తుదివ‌ర‌కు గ‌డువు

TG ICET 2026 | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్-2026 షెడ్యూల్ విడుద‌లైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో బుధవారం (జనవరి 28) షెడ్యూల్‌ను విడుదల చేసింది. తెలంగాణ ఐసెట్ 2026 నోటిఫికేషన్‌ ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఇక ఫిబ్రవరి 12 నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు.

మార్చి 16 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంటుంది. ఈ పరీక్ష బాధ్యతలను ఈసారి నల్ల‌గొండ‌లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి ఉన్నత విద్యా మండలి అప్పగించింది. టీఎస్ ఐసెట్ కన్వీనర్‌గా ఎంజీయూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ సీనియర్ ప్రొఫెసర్, వర్సిటీ రిజిస్టర్ అయిన ప్రొఫెసర్ అల్వాల రవిని నియమించింది. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.500గా, ఇతర అభ్యర్థులకు రూ.700గా నిర్ణయించారు.

TG ICET 2026
TG ICET 2026

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష మే 13, 14 తేదీల్లో జరుగుతుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఫిబ్రవరి 20న తెలంగాణ EdCET 2026 నోటిఫికేషన్ టీజీఎడ్ సెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ఏప్రిల్‌ 18 వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరిస్తారు. టీజీ ఎడ్‌సెట్‌–2026 నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 20న విడుదల చేయనున్నారు.

ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్‌ 18 వరకు చేసుకోవచ్చు. టీజీ ఎడ్‌సెట్‌–2026కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేశారు. రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష మే 12న జరుగుతుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.

CLICK HERE TO READ MORE

CLICK HERE TO READ 2026 లోనే నియామకాలు !

Leave a Reply