TG | భట్టితో కలిసి జోడెద్దుల్లా రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళుతున్నా – రేవంత్ రెడ్డి

హైదరాబాద్ – రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నామని.. తనతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జోడెద్దుల్లా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు.

రవీంద్ర భారతి లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమార్ హాజరయ్యారు. అనంతరం సీఎం మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం భట్టి ప్రవేవపెట్టిన బడ్జెట్ ఉగాది పచ్చడిలా షడ్రుచులతో ఉందని అన్నారు. వ్యవసాయ అభివృద్ధికి, పేదలకు విద్య అందిచేందుకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. అదేవిధంగా విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమానికి నిధులు కేటాయించామని చెప్పారు

రేపటి నుంచి రేషన్ షాపులలో సన్న బియ్యం..

ఇక ఒకప్పుడు పండగ రోజు మాత్రమే తెల్ల అన్నం తినే వారు.. ఎన్టీఆర్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ తెల్లన్నం తినేలా రేషన్ బియ్యం అందించారని ముఖ్యమంత్రి రేవంత్ గుర్తు చేశారు. ఇప్పుడు తమ ప్రభుత్వం దొడ్డు బియ్యం కాకుండా సన్నం బియ్యం తినేలా చేయాలని సంకల్పించింది అని తెలిపారు. రేషన్ పై సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. రైతులు కూడా ఎక్కువగా సన్న బియ్యం పండించాలని కోరుతున్నాం.. ఆ విషయంలో వారికి ఎంకరేజ్ చేసేందుకు సన్న బియ్యం పండించే వారికి బోనస్ కూడా అందిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలనే సంకల్పం మాది.. దేశానికే తెలంగాణ ఆదర్శంగా ఉండాలనే సంకల్పంతో పని చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు

పాడి పంటలతో, ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరికీ వచ్చేలా ఈ కొత్త సంవత్సరం ఉండాలని కోరుకుంటున్నాను.. భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ కూడా షడ్రుచుల మాదిరి ఉంది.. అందులో పేదలకు విద్య, వైద్యం అందేలా రచించారు.. రైతాంగం అభివృద్ధి చెందేలా బడ్జెట్ ప్రతిపాదన పెట్టారు.. ఇవన్ని జరగాలంటే లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఎవరైనా లా అండ్ ఆర్డర్ ను తప్పించేలా పని చేస్తే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నాను అని సీఎం తెలిపారు.

ఇక, హైదరాబాద్ కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉండాలని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.. అందులో భాగంగా మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపట్టాం.. దేశానికి ఆదర్శంగా ఉండేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్నాం.. అన్ని రకాల బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే.. అక్కడ పెట్టుబడులు అవసరమని చెప్పుకొచ్చారు. కొన్ని అభివృద్ధి పనులు చేపట్టినప్పుడు కొన్ని అడ్డంకులు రావడం సహజం.. అడ్డంకులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *