హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమంగా నిర్మించిన పేదల ఇళ్లనే కాకుండా… పెద్దల ఇళ్ల నిర్మాణాలను కూడా కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆక్రమణలకు పాల్పడిన బడాబాబుల భవనాలను కూల్చివేసినప్పుడే భూములకు రక్షణ లభిస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
హైదరాబాద్ పాత బస్తీ మీరాలం ట్యాంకు పరిసరాల్లో ఇళ్ల యజమానులకు రాజేంద్రనగర్ తహసీల్దార్ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో ఇళ్ల యజమానుల పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లోని ఆక్రమణలను ఎందుకు తొలగించట్లేదని హైడ్రాను నిలదీసింది.
చెరువుల పరిరక్షణ మంచి విషయమైనా చట్టం దృష్టిలో అందరూ సమానమేననని హైకోర్టు వ్యాఖ్యానించింది. మీరాలంలో నిర్మాణాలు ప్రభుత్వ స్థలంలో ఉంటే చర్యలు తీసుకోవాలని హైకోర్టు కోరింది.