TG | రాష్ట్రంలోని అందరి చూపులు కెసిఆర్ వైపే …. హ‌రీశ్ రావు

రుద్రారం – రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తోందని,.. ఏడాది కాంగ్రెస్ పాలనలో పాలేవో.. నీళ్ళేవో ప్రజలకు తెలిసిపోయింది అని అన్నారు బిఆర్ఎస్ సీనియర్ నేత , మాజీ మంత్రి హరీశ్ రావు. . ఆనాడు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అని చెప్పి.. ఇప్పుడు ముక్కు పిండి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ.. చేతలకు తక్కువ అని ఫైర్ అయ్యారు. ఇక, రైతు బంధు, రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి చెప్పేవి అన్ని అబద్ధాలే.. అసెంబ్లీలో సీఎం, డిప్యూటీ సీఎం భట్టిలకు రుణమాఫీపై సవాల్ విసిరితే ఉలుకులేదు, పలుకు లేదు అని అన్నారు.

సంగారెడ్డి జిల్లాలోని . పటాన్ చెరు బీఆర్ఎస్ నేత ఆదర్శ్ రెడ్డి పాదయాత్ర ప్రారంభ సంద‌ర్భంగా రుద్రారంలో గల గణేష్ గడ్డ ఆలయంలో నేడు నిర్వ‌హించిన పూజా కార్య‌క్ర‌మంలో హ‌రీశ్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణను నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టార‌ని అన్నారు. దేశ సగటులో జీఎస్టీ తగ్గిందంటే దానికి కారణం రేవంత్ రెడ్డే అంటూ మండిప‌డ్డారు.. కేసీఆర్ చెట్లు పెడితే…రేవంత్ రెడ్డి నరుకుతా అంటున్నార‌ని ద్వ‌జ‌మెత్తారు… కేసీఆర్ ది సాగు బాషా అయితే రేవంత్ రెడ్డిది చావు బాషా అని మండిపడ్డారు. బీసీల ధర్నాకు ఢిల్లీలోనే ఉన్న రాహుల్ గాంధీ ధర్నాకు రాలేదంటూ ఢిల్లీలో రేవంత్ ఖేల్ ఖ‌తం అయింద‌న్నారు….


హెచ్ సి యు విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టిన రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వ‌ర్శిటీలో అడవులు నరికిన రేవంత్ రెడ్డికి మూగ జీవాల ఉసురు తగులుతుంది అని హరీష్ రావు శాపనార్థాలు పెట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *