TG | రేపు ప్రభుత్వ సెలవు.. ఉత్తర్వులు జారీ !

బంజారాల ఆరాధ్య దైవమైన సంత్‌ సేవాలాల్‌ జయంతి సందర్భంగా శనివారం అధికారిక సెలవును ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు శనివారం ప్రత్యేక కాజువల్‌ లీవ్‌గా పేర్కొంటూ సీఎస్‌ శాంతికుమారి జీవో జారీ చేశారు. దేశవ్యాప్తంగా అధికారికంగా పలురకాల సేవా కార్యక్రమాలు, జయంతి వేడుకలను సైతం నిర్వహించబోతున్నారు.

అలాగే తెలంగాణలో కూడా సంత్‌ సేవాలాల్‌ జయంతిని ఉత్సవంగా నిర్వహించాలని గిరిజన నాయకులు సైతం గురువారం సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా శనివారం పబ్లిక్‌ హాలిడే ఇవ్వాలని కోరారు.

Leave a Reply