హైదరాబాద్ – 12 మంది సభ్యులతో కమిటీ హైదరాబాద్ ,ఆంధ్రప్రభ ముఖ్యమంత్రి చైర్మన్ గా ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ(ఎఫ్సీ టీఏ) ఏర్పాటైంది.ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ లో మొత్తం పన్నెండు మంది సభ్యులను ప్రభుత్వం నియమించింది. అథారిటీ చైర్మన్ గా ముఖ్యమంత్రి వైస్ చైర్మన్ గా పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి లేదా ఐటీ,పరిశ్రమల శాఖా మంత్రి వ్యవహరించనున్నారు.
అథారిటీ సభ్యులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,పరిశ్రమలు,ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి,హెచ్ఏం డీఏ కమీషనర్,తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ,రంగారెడ్డి జిల్లా కలెక్టర్,డీటీసీపీ,ఎఫ్సీ డీఏ కమీషనర్,సీఈఓ సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.