హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రాష్ట్రం అప్పుల నుంచి కోలుకోవాలంటే కేంద్ర సాయం అవసరం అని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయట పడేలా చేయాడానికి బీఆర్ఎస్ పార్టీ సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. అలాగే వక్ఫ్ బోర్డు కోసం చట్టం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వ ఓ మతాన్ని రెచ్చగొట్టి రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కంచ గచ్చిబౌలి భూమి వ్యవహారంలో ఉన్న ఆ బీజేపీ ఎంపీ ఎవరో కేటీఆర్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే తమకు బీఆర్ఎస్ పార్టీ తో కలిసి పని చేసే ఆలోచన లేదని, కాంగ్రెస్ తోనే ఫ్రెండ్లీ పాలసీ కొనసాగిస్తామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు.
TG | అప్పుల ఊబిలో తెలంగాణ – సీపీఐ ఎమ్మెల్యే కూనేంనేని
