ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ అదనపు పట్టణ ప్రణాళిక డైరెక్టర్గా డిటీసీపి ఎస్. దేవేందర్ రెడ్డిని నియమిస్తూ మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఇలంబరితి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఈ మేరకు దేవేందర్ రెడ్డి శుక్రవారం ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ అదనపు పట్టణ ప్రణాళిక డైరెక్టర్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. దీంతో, డీటీసీపీ తో పాటు ఫ్యూచర్ సిటీ బాధ్యతలు కూడా నిర్వర్తించనున్నారు.
జులైలో ఫ్యూచర్ సిటీలో మరిన్ని నియామకాలు
వచ్చే నెలలో ఫ్యూచర్ సిటీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో నియామకాలు ఊపందుకోనున్నాయని సమాచారం. ముఖ్యంగా GHMC, HMDA నుంచి లేఔట్ అనుమతులు, ప్లానింగ్, డెవలప్మెంట్ తదితర అంశాలపై పట్టున్న సీనియర్ అధికారులను నియమించే ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే, ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ తదితర కీలక అంశాలపై అధికారులు దృష్టి సారించారు.