TG | ఫ్రెంచ్ కాన్సుల్ జనరల్ బృందంతో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం టెక్నాలజీ మరియు ఇతర పరిశ్రమల స్థాపనకు అత్యంత అనుకూలమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ఆయనను ఫ్రెంచ్ కాన్సుల్ జనరల్ మార్క్ లెమైట్రే, ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం తెలంగాణలోని పారిశ్రామిక వనరులు, మౌలిక సదుపాయాలపై ఫ్రెంచ్ బృందంతో చర్చించారు. టెక్నాలజీ, పారిశ్రామిక పెట్టుబడులకు రాష్ట్రం అనువైన గమ్యస్థానమని చెప్పారు. రాష్ట్రంలోని వనరులు, అవకాశాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని ఫ్రెంచ్ ప్రతినిధులకు సూచించారు.

ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు..

Leave a Reply