TG | త్రివేణి సంగమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతుల పుణ్యస్నానం !

కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న సరస్వతీ పుష్కరాలకు తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆయన సతీమణి తో క‌లిసి హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా పుణ్య‌స్నానం ఆచ‌రించారు.

కాళేశ్వరంలో ఉపముఖ్యమంత్రి బస

సరస్వతి పుష్కరాలను పురస్కరించుకొని కాలేశ్వరం క్షేత్రానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం రాత్రి పర్యటన అనంతరం రాత్రి హైదరాబాద్ కు తిరుగు పయనం కావాల్సి ఉండగా.. వారు రాత్రి ఇక్కడే బస చేయనున్నారు. శనివారం ఉదయం శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం తిరుగు పయనం కానున్నారు.

Leave a Reply