TG CS | రాష్ట్ర నూతన సీఎస్‌గా రామకృష్ణారావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె. రామకృష్ణారావు నియమితులయ్యారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, 1989 బ్యాచ్‌కు చెందిన ప్రస్తుత సీఎస్ శాంతికుమారి 2021 జనవరి నుంచి సీఎస్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆమె పదవీ కాలం ఈ నెల 30న ముగియ‌నుంది.

ఈ నేపథ్యంలోనే తదుపరి సీఎస్ గా రామకృష్ణారావు నియ‌మితుల‌య్యారు. 1991 బ్యాచ్‌కు చెందిన రామ‌కృష్ణ రావు ఆర్ధికశాఖ స్సెష‌ల్ సీఎస్ గా ఉన్నారు. 2016 ఫిబ్రవరి నుంచి ఆర్థిక శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టుతో ముగియనుంది.

Leave a Reply