సరస్వతి పుష్కరాలలో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రులు ఈరోజు (మంగళవారం) మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సీనియర్ అధికారులతో కలిసి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు.
రహదారులు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌లకు కూడా మంత్రులు పుష్కరాల ఆహ్వాన పత్రికను అందించారు. ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు 12 రోజుల పాటు జరిగే భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చేస్తున్న ఏర్పాట్లపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ అడిగి తెలుసుకున్నారు.