TG CM | ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం

TG CM | ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం
TG CM | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : నిర్మల్ జిల్లాలోని బాసరకు సీఎం రేవంత్ రెడ్డి బయల్దేరారు. శ్రీ జ్ఞాన సరస్వతీ క్షేత్రం అభివృద్ధి పనులకు ఇవాళ భూమి పూజ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.225 కోట్లు కేటాయించింది. బాసరలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా పిప్రి బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్‌కు మూడేళ్లు పూర్తైన సందర్భంగా ఈ సభ నిర్వహిస్తున్నారు.
