TG | రేపు సొంతూరుకు సీఎం రేవంత్‌..

  • ‘ఇందిరా గిరి జల వికాసం’ పథకం ప్రారంభం

దేశానికే ఆదర్శంగా నిలిచే మరో ప్రతిష్టాత్మక రైతు సంక్షేమ పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. అసెంబ్లి వేదికగా ప్రకటించిన ‘ఇందిరా గిరి జల వికాసం’ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రేపు (సోమవారం) నాగర్‌కర్నూల్‌ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్‌ మండలం మాచారం గ్రామంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఒక్కో యూనిట్‌కు రూ.6లక్షల చొప్పున వంద శాతం సబ్సిడీతో ప్రభుత్వం అందించనుంది. ఈ పథకాన్ని ప్రారంభించి సోలార్‌ పంపుసెట్లను లబ్ధిదారులకు సీఎం పంపిణీ చేయనున్నారు. అనంతరం స్థానికంగా సీతారామాంజనేయ ఆలయాన్ని దర్శించుకుని బహిరంగ సభకు హాజరు కానున్నారు. సాయంత్రం కొండారెడ్డిపల్లె నుంచి తిరిగి హైదరాబాద్‌ చేరుకోనున్నారు.

మొత్తం రూ.12,600 కోట్ల వ్యయంతో, నాలుగేళ్ల కార్యాచరణ ప్రణాళికలో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని అమలు చేయాలని ప్రజా ప్రభుత్వం సంకల్పించింది. తద్వారా 2 లక్షల 10వేల మంది గిరిజన రైతులకు మేలు జరగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో రూ.600 కోట్ల వ్యయంతో మొత్తం 10వేల మంది గిరిజన రైతులకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ఈ పథకం అమల్లోకి రానుంది.

Leave a Reply