TG | రైల్వే మంత్రికి సీఎం రేవంత్ లేఖ..

కేంద్ర‌ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించిన చెర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు అమరుడు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది వేసిన పొట్టి శ్రీరాములు త్యాగాలను స్మరించుకుంటూ, చెర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని తెలంగాణ ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply